Supritha : కిస్సిక్ పాటకి అదిరిపోయే స్టెప్పులేసి సుప్రీత.. వీడియో చూసారా..
సీనియర్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత చాలా మందికి సుపరిచితమే. సీనియర్ నటి కూతురిగా కంటే సోషల్ మీడియా బ్యూటీగానే ఈమె ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.

Surekha Vani Daughter Supritha dancing to the Allu Arjun Sreeleela Kissik song
సీనియర్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత చాలా మందికి సుపరిచితమే. సీనియర్ నటి కూతురిగా కంటే సోషల్ మీడియా బ్యూటీగానే ఈమె ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. నిరంతరం తన సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుకుపోని అందంతో సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా అందుకుంది.
Also Read : Big Boss Priyanka : తిరుపతిలో కూడా అదే పాడుపని చేసిన బిగ్ బాస్ ప్రియాంక.. తీరా చూస్తే..
ప్రస్తుతం ఈ భామ ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా, సుప్రీత హీరోయిన్ గా ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంచిందిన షూటింగ్ కూడా జరుగుతుంది. మొదటి సారి హీరోయిన్ గా నటిస్తుండడంతో ఆ సినిమా కోసం బాగానే కష్టపడుతుంది. తన బాడీని కూడా చాలా మార్చేసింది ఈ భామ. అప్పుడపుడు షూటింగ్ స్పాట్ నుంచి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
View this post on Instagram
అయితే తాజాగా తన సినిమా హీరో బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డ్యాంసింగ్ క్వీన్ శ్రీలీల కలిసి చేసిన కిస్సిక్ సాంగ్ కి దుమ్ములేపే స్టెప్స్ వేశారు. ఇప్పటికే కిస్సిక్ సాంగ్ సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉందన్న సంగతి తెలిసిందే. చాల మంది ఈ సాంగ్ కి స్టెప్పులేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు సుప్రీత సైతం ఈ సాంగ్ కి డాన్స్ వేసింది. అచ్చం శ్రీలీల వేసిన స్టెప్పులతో డాన్స్ చేసిన ఆ వీడియో తన సోషల్ మీడియా వేదికగా షేర్ చెయ్యడంతో వైరల్ అవుతుంది.