The Raja Saab : రాజా సాబ్ మేకింగ్ వీడియో చూసారా? మారుతి తో ప్రభాస్ సందడి..

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ ‘ది రాజా సాబ్‌’.

Maruthi Special Making Video of The RajaSaab

Making Video of The Raja Saab : మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ ‘ది రాజా సాబ్‌’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. నేడు (అక్టోబ‌ర్ 8) ద‌ర్శ‌కుడు మారుతి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ద‌ర్శ‌కుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ది రాజా సాబ్ మేకింగ్ వీడియోను విడుద‌ల చేసింది. ఈ వీడియోలో ప్ర‌భాస్ న‌వ్వుతూ క‌నిపించాడు.

అమల, నాగచైతన్యతో కలిసి నాంపల్లి కోర్టుకు నాగార్జున.. స్టేట్‌మెంట్ ఏమని ఇచ్చారంటే?

హారర్, రొమాంటిక్, కామెడీ క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 2025 ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.