మా కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేశారు: నాగార్జున

అలా మాట్లాడం వలన తమ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని అన్నారు.

మా కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేశారు: నాగార్జున

Nampally Court Hearing on Hero Nagarjuna Petition

Updated On : October 8, 2024 / 5:44 PM IST

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వక వాఖ్యలు చేశారంటూ పరువు నష్టం దావా వేసిన సినీనటుడు నాగార్జున ఇవాళ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం కోసం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కోర్టుకు అమల, నాగ చైతన్య, సుప్రియ, నాగ సుశీల కూడా వచ్చారు.

దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వక వాఖ్యలు చేశారని నాగార్జున తెలిపారు. దీని వలన తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు నాగార్జున స్టేట్‌మెంట్ ఇచ్చారు.

సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్ఠలు ఉన్నాయని నాగార్జున తెలిపారు. దేశవ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని అన్నారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని తెలిపారు.

తమ కొడుకు విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. అలా మాట్లాడం వలన తమ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని అన్నారు. మంత్రి కొండా సురేఖఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

హవాలా మార్గంలో భారత్‌ నుంచి చైనాకు రూ.50 వేల కోట్లు.. ఏం జరిగిందో తెలుసా?