Vishwak Sen : విశ్వక్ మూవీ లైనప్ మాములుగా లేదుగా.. స్టార్ హీరోలకు కూడా ఇన్ని సినిమాలు లేవు

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలోనే మెకానిక్ రాకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు.

Vishwak Sen : విశ్వక్ మూవీ లైనప్ మాములుగా లేదుగా.. స్టార్ హీరోలకు కూడా ఇన్ని సినిమాలు లేవు

Mas Ka Das Vishwak Sen movie line up Even star heroes dont have so many movies

Updated On : November 20, 2024 / 7:40 PM IST

Vishwak Sen : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలోనే మెకానిక్ రాకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని రిలీజ్ చేశారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నవంబర్ 22న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా పెద్దెత్తున నిర్వహిస్తున్నారు మేకర్స్. విశ్వక్ సైతం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. అన్ని ఇంటర్వూస్ లో కూడా ఇదే చెప్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత కూడా వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ప్రస్తుతం విష్వక్ సేన్ మూవీ లైనప్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. స్టార్ హీరోస్ కి ఏమాత్రం తీసుకుపోకుండా దాదాపుగా 6 సినిమాలను లైన్ లో పెట్టాడు. ఆ మూవీ లైనప్ లో.. మొదట లైలా సినిమా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ సైతం 60 శాతం పూర్తయింది.

Also Read : Kollywood : యూట్యూబ్ చానెల్స్ కి షాక్ ఇచ్చిన కోలీవుడ్ నిర్మాతలు.. ఇకనుండి అవి కుదరవ్..

అలాగే జనవరిలో అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నారు. శ్రీధర్‌ గంటా – సుధాకర్‌ చెరుకూరి కలయికలో ఒక సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మార్చిలో మరో సినిమా మొదలవుతుంది. గతంలో విశ్వక్ నటించిన ‘ఏమైంది ఈ నగరానికి’ సినిమాకి పార్ట్ 2 రాబోతుంది. దీనికి సంబందించిన స్క్రిప్ట్‌ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంది. అలా దాదాపుగా 6 సినిమాలు లైన్ లో పెట్టాడు ఈ యంగ్ హీరో.