Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది....

Mass Jathara Of Machelra Niyojakavargam To Be Held In Srikakulam

Macherla Niyojakavargam: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Macherla Niyojakavargam: పూనకాలు తెప్పించేలా.. మాచర్లలో నితిన్ ఫస్ట్ అటాక్!

ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్‌కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా నుండి ‘‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ’’ అనే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ మాస్ సాంగ్ రిలీజ్‌ను జాతరలా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ మాస్ జాతరను శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్‌లో జూలై 9న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Macherla Niyojakavargam: ఐటెం సాంగ్.. బాలీవుడ్ భామను తీసుకొస్తున్న నితిన్

కాగా, ఈ మాస్ సాంగ్‌లో హీరో నితిన్‌తో పాటు అందాల భామ అంజలి స్టెప్పులు వేసేందుకు రెడీ అయ్యింది. గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలోనూ అంజలి హాట్ ఐటెం సాంగ్ చేయగా, అది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ ఐటెం సాంగ్ చేస్తుండటంతో, తెలుగు ప్రేక్షకుల చూపులు ఈ పాటపై పడ్డాయి. మరి మాచర్ల నియోజకవర్గం మాస్ జాతరకు శ్రీకాకుళంలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామలు కృతి శెట్టి, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.