×
Ad

Mass Jathara : హమ్మయ్య ఇన్ని వాయిదాల తర్వాత ‘మాస్ జాతర’ వచ్చేస్తుంది.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

రవితేజ మాస్ జాతర సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. (Mass Jathara)

Mass Jathara

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ 75వ సినిమాగా ‘మాస్ జాతర’ తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే మాస్ జాతర సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసారు.(Mass Jathara)

అయితే ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మొదట సంక్రాంతి అన్నారు, తర్వాత సమ్మర్ అన్నారు, తర్వాత వినాయక చవితి అన్నారు. కానీ ప్రతిసారి వాయిదా పడుతూనే వస్తుంది. తాజాగా మాస్ జాతర కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. రవితేజ, ఆది కలిసి సరదాగా రిలీజ్ డేట్ గురించి ఓ వీడియో చేసారు. ఆ వీడియోలో కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న థియేటర్స్ లోకి రానున్నట్టు తెలిపారు.

Also Read : Allu Sirish : ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న అల్లు శిరీష్.. ఈఫిల్ టవర్ నుంచి అనౌన్స్..

ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఆ డేట్ లో వేరే ఏ సినిమాలు లేకపోవడంతో రవితేజకి కలిసొస్తుందని భావిస్తున్నారు.

 

Also Read : Kantara Chapter 1 : అంతన్నారు ఇంతన్నారు.. పాన్ ఇండియా అన్నారు.. ఓపెనింగ్స్ OG లో సగం కూడా లేవుగా.. ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్..