Raviteja : మాస్ మహారాజ ఆ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నాడా? ‘మాస్ జాతర’ కోసం..

రవితేజ ఇపుడు హీరోగా నటిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ సినిమా 'మాస్ జాతర'.

Mass Maharaj Raviteja Planning Super hit song Remix in Mass Jathara Movie

Raviteja : మాస్ మహారాజా రవితేజకు ధమాకా తర్వాత సరైన హిట్టు పడలేదు. మిస్టర్ బచ్చన్ మూవీ కూడా రవితేజ ఆశలపై నీళ్లు చల్లింది. ఈసారి రవితేజ పక్కా ప్లాన్ తో వస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరకి సై అంటున్నాడు. రవితేజ ఇపుడు హీరోగా నటిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ సినిమా ‘మాస్ జాతర’. డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌‌ తర్వాత దాదాపు టాకీ పార్ట్‌‌ అంతా పూర్తి అయిపోయినట్టే అని తెలుస్తోంది. రవితేజలోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ ఈ సినిమా చేస్తున్నారట.

‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తుంటే, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడం సినిమాపై స్పెషల్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇటీవల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాలో రవితేజకు తాతగా నటించాను, సినిమా అదిరిపోయింది అని చెప్పారు. రవితేజ ఫ్యాన్స్ ఈ మధ్య మిస్ అవుతున్న కామెడీ, మాస్ మిక్స్ చేసి ఈ మాస్ జాతర సినిమాలో పెడుతున్నారట.

Also Read : Tollywood Heros : నిర్మాతలుగా మారి బిజీ అవుతున్న హీరోలు..

ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్‌‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్‌కు తగ్గట్లుగానే రవితేజను పూర్తిగా మాస్‌ యాక్షన్‌ కోణంలోనే చూపించారు. మొత్తానికి ఈ మూవీని సమ్మర్‌‌‌‌లో రిలీజ్‌‌ చేసేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో రవితేజ కెరీర్లో భారీ హిట్ ‘ఇడియట్’ సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ చూపుల్తో గుచ్చి గుచ్చి సాంగ్.. ని రీమిక్స్ చేయనున్నారంటూ రూమర్స్ వినిపించాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఆ పాట అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఊపు తెప్పించిన పాట. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో ఫ్యాన్స్, ఆడియన్స్ రచ్చ చేయడం కంఫర్మ్.

మాస్ జాతర తర్వాత మరో సినిమాను లైనప్ లో పెట్టారు రవితేజ. నేను శైలజ, చిత్రలహరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుందని గాసిప్ మొదలైంది. అన్నిఅనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని దర్శకుడు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సమ్మర్ లో మాస్ జాతరతో రానున్న రవితేజ. సంక్రాంతికి మరో జాతరకి రెడీ అవుతున్నాడన్నమాట.