Mass Jathara
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ 75వ సినిమాగా ‘మాస్ జాతర’ రాబోతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే మాస్ జాతర సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. మాస్ జాతర సినిమా ఆగస్టు 27న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
మీరు కూడా మాస్ జాతర టీజర్ చూసేయండి..