‘‘సరిలేరు నీకెవ్వరు’’.. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35ఎంఎం (మెయిన్ థియేటర్) వద్ద 81 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేయడం విశేషం..
మహేష్, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నసినిమా ‘‘సరిలేరు నీకెవ్వరు’’.. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో సరిలేరు టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 40 గంటల్లోనే 20 మిలియన్ రియల్‌టైమ్ వ్యూస్ సాధించి 40 గంటల పాటు కంటిన్యూగా యుట్యూబ్‌లో నెం1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉండడం విశేషం.
ఈ టీజర్‌తో సినిమాపై అటు ప్రేక్షకులలో, ఇటు మహేష్ అభిమానులలో అంచనాలు రెట్టింపు అయ్యాయి. సినిమా విడుదలకు ఇంకా 45 రోజులకు పైగా టైమ్ ఉంది. అప్పుడే హైదరాబాద్‌లోని సుదర్శన్ 35ఎంఎం (మెయిన్ థియేటర్) వద్ద 81 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ కటౌట్ చూపరులను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.