Massive Item Song: ప్రత్యేక గీతంలో సమంతతో అల్లు అర్జున్ స్టెప్పులు

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా పుష్ప.

Puspa

Massive Item Song: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా.. ఇప్పటికే వచ్చిన టీజర్‌, ఫస్ట్‌లుక్‌, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ క్రమంలోనే పుష్ప సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ ప్లాన్‌ చేయగా.. అందులో సమంతతో బన్నీ స్టెప్పులు వెయ్యబోతున్నారంట. రీసెంట్‌గా అల్లు అర్జున్, వెయ్యి మంది డాన్స‌ర్స్‌తో హైద‌ర‌బాద్‌లో ఓ భారీ పాట‌ను చిత్రీక‌రించారు. ఈ సాంగ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా తీయ్యాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.

ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. రంగ స్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అల్లూ అర్జున్ లుక్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి.