Site icon 10TV Telugu

SDT 18 Update : సాయి దుర్గా తేజ్ SDT18 నుంచి సాలీడ్ అప్‌డేట్‌..

Massive Update from Sai Durgha Tej movie SDT18

Massive Update from Sai Durgha Tej movie SDT18

సాయి దుర్గా తేజ్ ‘బ్రో’ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు SDT18 సినిమాతో రాబోతున్నాడు. హనుమాన్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రోహిత్ దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా ఇది తెరకెక్కబోతుంది

ఇక ఈ చిత్రం నుంచి తాజా సాలీడ్ అప్‌డేట్ వ‌చ్చింది. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ వీడియోను పంచుకుంది.

Bigg Boss 8 : డేంజ‌ర్ జోన్‌లో ఆ ఇద్ద‌రు? ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవ‌రంటే?

పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ గురించి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో సాయి దుర్గా తేజ్ మాట్లాడాడు. హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 300 స్ఫూర్తితో ఈ మూవీ చేయ‌బోతున్న‌ట్లు చెప్పారు. త‌న కెరీర్‌లో హ‌య్యెస్ట్ బడ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంద‌న్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌తో పాటు ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని మ‌రో మెట్టు ఎక్కించే మూవీగా ఇది నిలుస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని అన్నాడు. శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంద‌న్నారు.

Pushpa 2 : బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా అల్లు అర్జున్ పుష్ప-2.. సరికొత్త రికార్డ్ ?

Exit mobile version