Bigg Boss 8 : డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు? ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవరంటే?
ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bigg Boss Telugu 8 Elimination Week 8 Nayani Pavani in danger zone
Bigg Boss 8 : బిగ్‌బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఏడువారాల్లో ఏడుగురు బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఎనిమిదో వారం చివరికి వచ్చేసింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం ఆరుగురు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని లు నామినేషన్‌లో ఉన్నారు.
ఈ వారం ఓటింగ్‌లో నిఖిల్ టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు ప్రేరణ రెండో స్థానంలో కొనసాగుతోంది. కొత్త మెగా చీఫ్ విష్ణు ప్రియ మూడు, పృథ్వీ నాలుగో స్థానంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక డేంజర్ జోన్‌లో మెహబూబ్, నయని పావనిలు ఉన్నారట. వీరిద్దరకి అతి తక్కువగా ఓట్లు వచ్చాయట. మెహబూబ్ ఐదులో, నయని పావనిలు ఆరో స్థానంలో ఉన్న సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
OG making video : ‘ఓజీ’ మేకింగ్ వీడియో విడుదల.. దర్శకుడి పుట్టిన రోజు స్పెషల్..
ఈ వారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు అని అంటున్నారు. కాగా.. గత వారం నాగ మణికంఠ ఎలిమినేషన్ సమయంలో హోస్ట్ నాగార్జున ఓ మాట చెప్పారు. వచ్చే వారం ఊహించని ట్విస్ట్ ఉంటుందని అన్నారు. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎలిమినేట్ అయిన వాళ్లలోంచి ఒకరు రీ ఎంట్రీ ఇస్తారనే టాక్ నడుస్తోంది.