OG making video : ‘ఓజీ’ మేకింగ్ వీడియో విడుదల.. దర్శకుడి పుట్టిన రోజు స్పెషల్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’(OG) ఒకటి.

OG making video release director birthday special
OG making video : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’(OG) ఒకటి. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథనాయిక. శ్రియా రెడ్డి కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ను పునః ప్రారంభించినట్లు చిత్ర బృందం తెలియజేసింది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ అభిమానులను అలరించాయి. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.
దర్శకుడు సుజిత్ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 26). ఈ క్రమంలో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ చిత్ర బృందం ఓజీ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
It all begins with one word – ACTION 🔥
And what’s left?⁰Just ashes in the FIRESTORM 😉⚰️#HappyBirthdaySujeeth ❤️ #TheyCallHimOG #OG #FireStormIsComing pic.twitter.com/6Elt8x9xuz
— DVV Entertainment (@DVVMovies) October 26, 2024