Unstoppable with NBK S4 : భువనేశ్వరి, బ్రాహ్మణిల్లో ఇంట్లో ఎవరు బాస్..? బాలయ్య ప్రశ్నకు చంద్రబాబు ఏమన్నారంటే?
భువనేశ్వరి, బ్రాహ్మణిల ఫోటోలు తెరపై చూపించి ఈ ఇద్దరిలో మీకు ఎవరు బాస్ అని చంద్రబాబును బాలయ్య ప్రశ్నించారు.

Who is the boss in Bhuvaneshwari Brahmani in house Chandrababu answer viral
Unstoppable with NBK S4 : ఆహా వేదికగా బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు మొదటి ఎపిసోడ్‌కు అతిథిగా వచ్చారు. తన వ్యక్తిగత, రాజకీయాలు, ఇంకా ఎన్నో వంటి విషయాలను చంద్రబాబు పంచుకున్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణిల ఫోటోలు తెరపై చూపించి ఈ ఇద్దరిలో మీకు ఎవరు బాస్ అని చంద్రబాబును బాలయ్య ప్రశ్నించారు.
భువనేశ్వరి నాకు బాస్, బ్రాహ్మణి మా అబ్బాయికి బాస్ అని చంద్రబాబు చెప్పారు. ట్రైన్ చేసి పంపించామని, తట్టుకోలేక మీ ఇంటికి పంపించాము అని బాలయ్య నవ్వుతూ అన్నారు. తమ కుటుంబానికి బలం వారేనని చంద్రబాబు చెప్పారు.
ఇక వంట వచ్చా అన్న ప్రశ్నకు తాను పప్పు బ్రహ్మాండంగా చేస్తానని, ఆమ్లెట్ ఈజీగా వేస్తానని, ఈ రెండు తప్ప ఇంకేమీ రావని చంద్రబాబు తెలిపారు. ఇక టీ కాఫీల్లో ఏదీ ఇష్టం అన్న ప్రశ్నించగా.. ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మద్య ఓ కాఫీ తాగునని చంద్రబాబు చెప్పారు.
హైదరాబాద్‌లో ఉన్నప్పుడు భువనేశ్వరితో కలిసి తాగుతానని, అదే అమరావతిలో అయితే డైనింగ్ టేబులే తనకు తోడు అని తెలిపారు. భువనేశ్వరి హైదరాబాద్‌లో ఉండడం వల్ల ఎప్పుడో గానీ కలిసి కూర్చునే అవకాశం రాదని, అలాంటి సందర్భం వస్తే అదే పెద్ద పండుగ అని చంద్రబాబు తెలిపారు.
Unstoppable : మనవడు దేవాంశ్ ప్రశ్నలు.. ఫన్నీగా సమాధానాలు ఇచ్చిన చంద్రబాబు.