Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి.. కాబోయే స్టార్ హీరోయిన్.. వరుస సినిమాలతో ఒక్కసారిగా బిజీ..

ఇప్పుడు టాలీవుడ్ కి ఇంకో స్టార్ హీరోయిన్ తయారవ్వబోతుంది. హర్యానా భామ మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అవుతుంది.

Meenakshi Chaudhary getting huge movie offers in Tollywood

Meenakshi Chaudhary :  సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరు స్థార్ అవుతారో తెలీదు. ఒక్క సినిమాతో స్టార్ అయిపోవచ్చు. లేదా అనుకోకుండా ఒక్కసారే ఆఫర్లు రావొచ్చు. ఇప్పుడు టాలీవుడ్ కి ఇంకో స్టార్ హీరోయిన్ తయారవ్వబోతుంది. హర్యానా భామ మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అవుతుంది.

అనేక వరుస అందాల పోటీల్లో పాల్గొని మీనాక్షి చౌదరి మిస్ ఇండియా హర్యానా, మిస్ ఇండియా 2018 రన్నరప్, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్.. ఇలా అనేక అందాల కిరీటాలు గెలుచుకుంది. ఓ రెండు మ్యూజిక్ వీడియోలు చేసి హిందీలో ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. తెలుగులో ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ అనే సినిమాలో సుశాంత్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ ఖిలాడీ, అడివి శేష్ హిట్ 2 సినిమాలతో మెప్పించింది. ఇటీవల ‘కొలై’ అనే తమిళ సినిమాతో తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

RGV : ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. అవన్నీ వేస్ట్.. మీకు ట్యాలెంటు ఉంటే నా దగ్గరికి రండి..

ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది మీనాక్షి. మీనాక్షి ఇప్పుడు 3 సినిమాలతో బిజీగా ఉంది. మొన్నీమధ్యే వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబినేషన్లో స్టార్ట్ అయిన ‘మట్కా’ సినిమాలో వరుణ్ కి జంటగా ఓకే అయింది. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలవ్వనుంది. విశ్వక్ సేన్ సరసన ఒక సినిమా చేస్తోంది. ఇక ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ దక్కించుకుంది. త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మీనాక్షి చౌదరికి వచ్చినట్టు సమాచారం. ఇంకా ప్రకటించని సినిమాలు కూడా రెండు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. దీంతో మీనాక్షి ఒక్కసారిగా టాలీవుడ్ లో బిజీ అయిపోయింది. మహేష్ సినిమా బయటకి వస్తే మీనాక్షి స్టార్ హీరోయిన్ అయి మరిన్ని అవకాశాలు గ్యారెంటీ అంటున్నారు సినీ వర్గాలు.