Ashoka Vanamlo Arjuna Kalyanam : అల్లం గారి పెళ్లి కూతుర్ని చూశారా..
అల్లం అర్జున్, తనకి పసుపులేటి మాధవితో పెళ్లి ఫిక్స్ అయిపోయిందని తెగ సంబరపడిపోతున్నాడు..
- sekhar
- Published On : January 15, 2022 / 06:27 PM IST
Ashoka Vanamlo Arjuna Kalyanam
Ashoka Vanamlo Arjuna Kalyanam: ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’, ‘పాగల్’ సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. విద్యా సాగర్ చింతా డైరెక్ట్ చేస్తున్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్.
Ori Devuda : ‘ఓరి దేవుడా’ అంటున్న విశ్వక్ సేన్
ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ నటిస్తున్న 7వ చిత్రమిది. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. సంక్రాంతి కానుకగా ‘మీట్ అల్లం గారి పెళ్లి కూతురు’ పేరుతో ఈ సినిమా నుండి ఓ వీడియో రిలీజ్ చేశారు.
Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..
తనకు పెళ్లికి అమ్మాయి దొరికేసిందంటూ.. మైక్ సెట్ పెట్టి మరీ ఊరంతా చెప్తుంటాడు అర్జున్. అది చూసి ఓ పెద్దాయన పెళ్లి తర్వాత ఉన్న వెంట్రకలు కూడా ఊడిపోతాయంటూ భయపెడతాడు. అర్జున్ మాత్రం తనకు అమ్మాయి బాగా నచ్చేసిందని చెప్తాడు.
Krithi Shetty : గోల్డెన్ లెగ్ బేబమ్మ..
‘ఓ ఆడపిల్లా.. నువ్వర్థం కావా.. నా జీవితంతో ఆటాడుతావా.. అంటూ బ్యాగ్రౌండ్‌లో వచ్చే సాంగ్ ఆకట్టుకుంటోంది. యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు ఈ వీడియోకి. ఈ సినిమాకి జే క్రిష్ సంగీతం, పవి కె పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది.
