దుర్గమ్మ సన్నిధిలో మిస్టర్ మజ్ను టీమ్
బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మిస్టర్ మజ్నుమూవీ యూనిట్.

బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మిస్టర్ మజ్నుమూవీ యూనిట్.
అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ జంటగా, తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన మిస్టర్ మజ్ను.. ఈ నెల 25న రిలీజ్ అయిన ఈ సినిమాకి యూత్ బాగానే కనెక్ట్ అవుతున్నారు. సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మూవీ యూనిట్ థియేటర్స్‌కి వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకుంటుంది. మొన్న హైదరాబాద్ థియేటర్స్‌ని విజిట్ చేసిన మిస్టర్ మజ్ను టీమ్, ఈ రోజు (జనవరి 30) విజయవాడ, గుంటూరులో ప్రేక్షకులను కలవబోతుంది.
విజయవాడలో దిగగానే, టీమ్ అంతా కలిసి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అఖిల్, నిధి అగర్వాల్‌లను చూసేందుకు భక్తులు, అభిమానులు ఎగబడ్డారు. అఖిల్, హలో సినిమాలతో పోలిస్తే, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మిస్టర్ మజ్ను, హీరోగా అఖిల్‌కి కాస్త ఊరటనిచ్చిన సినిమా అవడంతో సినిమా ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది చిత్రబృందం.
వాచ్ కోపంగా వీడియో సాంగ్…