Mega 157 : మెగాస్టార్ ఏజ్‌కి తగ్గ రోల్ చేస్తారు.. రజినీకి జైలర్.. కమల్ కి విక్రమ్.. చిరంజీవికి ‘మెగా 157’

ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెగాస్టార్ పుట్టిన రోజు నాడు మెగా 156 సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగా 157 సినిమా వశిష్ట దర్శకత్వంలో ఉండబోతున్నట్టు ప్రకటించారు.

Mega 157 Movie Update :  మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయన రేంజ్ కి తగ్గ హిట్ పడలేదని అభిమానులు ఇప్పటికి ఫీల్ అవుతున్నారు. చిరంజీవి చేసే సినిమాలను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వాల్తేరు వీరయ్య(waltair Veerayya) హిట్ అయినా అందులో కూడా కొన్ని మైనస్ లు వెతికి మరీ ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఆయన ఏజ్ కి తగ్గ రోల్ చేయట్లేదని కామెంట్స్ వస్తున్నాయి. అయన చేసే సినిమాల్లో అయన పక్కన కుర్ర హీరోయిన్స్, వర్కౌట్ అవ్వని కామెడీ ఇలాంటివి పెట్టి మెగాస్టార్ రేంజ్ ని తగ్గించేస్తున్నారని అభిమానులు బాధపడుతున్నారు.

ఇటీవల కమల్ హాసన్ ఆయన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ తో విక్రమ్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. రజినీకాంత్ కూడా అయన ఏజ్ కి తగ్గట్టు జైలర్ సినిమాతో వచ్చి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అదే టైంలో చిరంజీవి భోళా శంకర్ అనే రీమేక్ సినిమాతో వచ్చి డిజాస్టర్ చూడటంతో పలువురు నెటిజన్లు, యాంటీ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు. ఈ విషయంలో మెగా అభిమానులు హార్ట్ అయ్యారు. చిరంజీవి ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ లో సినిమా చేయాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెగాస్టార్ పుట్టిన రోజు నాడు మెగా 156 సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగా 157 సినిమా వశిష్ట దర్శకత్వంలో ఉండబోతున్నట్టు ప్రకటించారు. కళ్యాణ్ కృష్ణ సినిమా ఏమో కానీ వశిష్ట సినిమాపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వశిష్ట బింబిసార సినిమాతో హిట్ కొట్టాడు. మెగా 157 సినిమా కూడా సోషియో ఫాంటసీ అని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Devil : నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. ఒక్క పాట కోసం ఇన్ని రకాల విదేశీ వాయిద్యాలు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ట మెగా 157 సినిమా గురించి మాట్లాడుతూ.. చిరంజీవి గారిని చాలా మెచ్యూర్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాను. ఆయన రేంజ్, ఆయన ఏజ్ కి తగ్గట్టు ఉంది. కమల్ హాసన్ గారు విక్రమ్ లో, రజినీకాంత్ జైలర్ సినిమాలో వాళ్ళ ఏజ్ కి తగ్గ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేశారు. అలాగే ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆయన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ ఇందులో చేస్తారు ఇందులో రొమాన్స్ ఉండదు అని చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇప్పటికైనా బాస్ కి తగ్గ క్యారెక్టర్ లో చూపిస్తారని ఆశిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు