Nagababu Visit Nehru Zoo park
Mega Brother Nagababu : మెగా బ్రదర్ నాగబాబు హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్ ను సందర్శించారు. అక్కడ వన్యప్రాణుల ఎన్‌క్లోజర్స్‌ని సందర్శించి వన్యప్రాణుల కోసం జూ అధికారులు తీసుకుంటున్న సంరక్షణ చర్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన జూ సందర్శన చక్కని అనుభూతినిచ్చిందన్నారు.
జూ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన నాగబాబు తన సోదరి విజయ తరుఫున… రూ.35 వేల రూపాయలు అందించారు. వాటితో ఒక జత సెనెగల్ రామచిలుకలను కొనుగోలు చేయాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో కనిపించిసందడి చేసిన నాగబాబు.. ఆవేడుకకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను గట్టిగా ముద్దుపెట్టుకుని అభిమానులను అలరించాడు.
ఆ తర్వాత తన సోదరీమణులతో రాఖీ కట్టించుకున్నాడు. ఎంతో ఉత్కంఠరేపుతున్నమా అధ్యక్ష ఎన్నికల్లో నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతుఇస్తూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు.