Bheemla Nayak (1)
Bheemla Nayak: పబ్లిసిటీ ఐడియాతో మెగాబ్రదర్స్ అదుర్స్ అనిపించుకున్నారు. భీమ్లా సెట్ లో చిరూ.. గాడ్ ఫాదర్ లొకేషన్ లో పవన్ కనిపించి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు చేస్తున్న సినిమాల్లో.. కొన్ని ఇంట్రెస్టింగ్ పోలికలున్నాయి.. వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. వాటినే హైలెట్ చేస్తూ రూపొందించిన మేకింగ్ వీడియో ఒకటి గురువారం రామ్ చరణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది మెగా అభిమానులను కలిపేదిగా.. ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్ చేసేదిగా బాగా ఉపయోగపడుతుంది.
Bheemla Nayak: చేతులెత్తేసిన యాజమాన్యాలు.. కృష్ణాజిల్లాలో థియేటర్లు బంద్!
భీమ్లాను వాడేస్తున్నాడు గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ తో కలిసి హాట్ టాపిక్ అయ్యాడు భీమ్లా నాయక్. ఒకరి సినిమా సెట్స్ లో మరొకరు సందడి చేసి ఫ్యాన్స్ కి మెగాబ్రదర్స్ ఫుల్ మీల్స్ వడ్డించారు. మెగాస్టార్, పవర్ స్టార్ కలిసిన ఈ సూపర్ వీడియోను మెగాపవర్ స్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామ్ చరణ్ షేర్ చేసిన ఈ అపూర్వ అన్నదమ్ముల కలయికను ఫుల్ గా ట్రెండ్ చేయడమే మెగాఫ్యాన్స్ ఇప్పుడు పనిగా పెట్టుకున్నారు.
Bheemla Nayak: హిందీలో రిలీజ్ కాని భీమ్లా నాయక్.. కారణం ఇదే!
ఏపీ టికెట్ ఇష్యూలో చిరూ, పవన్ మధ్య క్లాష్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. సో అలాంటిదేమి లేదని ఒక్క వీడియోతో క్రేజీ బ్రదర్స్ ప్రూవ్ చేశారు. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో కాసేపు ఖైదీగా మెగాస్టార్ నటిస్తుండగా… భీమ్లానాయక్ లో పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా పవన్ కనిపించబోతున్నారు. గాడ్ ఫాదర్ కోసం ఖైదీగా మేకోవర్ అయిన చిరూని భీమ్లా నాయక్ మీట్ అయ్యారు. ఇక పోలీసాఫీసర్ భీమ్లాగా తయారైన పవన్ కల్యాణ్ ను ఖైదీ బట్టలతో ఉన్న గాడ్ ఫాదర్ కలిసి సరదాగా గడిపారు.
God Father: పూరి ‘చిరు’ సాయం.. స్క్రిప్ట్‌లో మార్పులా?
ఏదైమైనా ఒక్క వీడియోతో మెగాబ్రదర్స్ పబ్లిసీటీ ఐడియా అదిరిందనే కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. పవన్ కల్యాణ్ భీమ్లానాయక్.. చిరూ గాడ్ ఫాదర్.. రెండూ మలయాళంలో సూపర్ హిట్టైన సినిమాల రీమేక్ లే. సో ఇద్దరి సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ బజ్ క్రియేటై ఉంది. కాకపోతే తమ్ముడు రిజల్ట్ ముందు వచ్చేయగా.. అన్నయ్య సినిమా రావడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది.
#GODFATHER and #BHEEMLANAYAK visit each other’s film sets!#BheemlaNayakOn25thFeb @KChiruTweets @PawanKalyan pic.twitter.com/oGo9XuPuax
— Ram Charan (@AlwaysRamCharan) February 24, 2022