Mega Children : మెగా మనవళ్ళు, మనవరాళ్లు.. ఒకే పిక్ లో.. చరణ్ కూతురు మిస్ అయిందే..

నిన్న బాలల దినోత్సవం సందర్భంగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల(Sreeja Konidela) ఈ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.

Mega Children Photo Goes Viral on Children's Day shared by Sreeja Konidela

Mega Children : మెగా ఫ్యామిలీ(Mega Family) నిండా హీరోలు, నటులు, యాక్టర్లు.. అంతా సినీ పరిశ్రమకి చెందినవారే. అల్లు ఫ్యామిలీని(Allu Family) కూడా కలుపుకుకొని ఈ సంఖ్య పెద్దగానే ఉంటుంది. మెగా అల్లు ఫ్యామిలిలో ఏ ఈవెంట్, ఫంక్షన్ అయినా అందరూ ఒకచోట చేరి సందడి చేస్తారని తెలిసిందే. అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ కజిన్స్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇటీవలే దీపావళికి మెగా కజిన్స్ అంతా కలిసి ఫోటో పోస్ట్ చేశారు.

వరుణ్ తేజ్(Varun Tej) పెళ్లి ఇటలీలో జరిగినప్పుడు మెగా అల్లు ఫ్యామిలీలు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ పెళ్లి నుంచి అనేక ఫ్యామిలీ ఫోటోలు బయటకి వచ్చి సందడి చేశాయి. తాజాగా మరో ఫోటో బయటకి వచ్చింది. ఈ ఫొటోలో మెగా అల్లు ఫ్యామిలీకి చెందిన పిల్లలు అంతా ఉన్నారు.

నిన్న బాలల దినోత్సవం సందర్భంగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల(Sreeja Konidela) ఈ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో చిరంజీవి పెద్ద కూతురు పిల్లలు, చిన్న కూతురు పిల్లలు, అల్లు అర్జున్ పిల్లలు, ఇంకొంతమంది మెగా ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఫొటోలో చరణ్ కూతురు చిన్ని పాప క్లిన్ కార మిస్ అయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగా మనవళ్ళు, మనవరాళ్లు అని కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో జనరేషన్ రెడీ అవుతుంది టాలీవుడ్ కోసం అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ నటులంతా కలిసి ఒకే పిక్ తోనే వైరల్ అవ్వడం కాకుండా ఇప్పుడు ఇలా మెగా చిల్డ్రన్స్ తో కూడా వైరల్ అవుతుంది.