Site icon 10TV Telugu

Mega Heros : జిమ్ లో మెగా కజిన్స్.. పవర్ ఫుల్ లుక్స్.. ఫొటో వైరల్..

Mega Heros Ram Charan Varun Tej Sai Durgha Tej Hard Working in Gym Photo goes Viral

Mega Heros

Mega Heros : మెగా ఫ్యామిలీ హీరోలు అంతా ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు మెగా కజిన్స్ అంతా కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా నేడు ఆదివారం స్పెషల్ గా మెగా కజిన్స్ జిమ్ లో కష్టపడుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఈ ఫొటోలో వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్ ఉన్నారు. ముగ్గురు జిమ్ లో కష్టపడి బీస్ట్ మోడ్ లో స్పెషల్ సెల్ఫీ దిగారు. ఈ ఫోటోని వరుణ్, సాయి తేజ్, జిమ్ ట్రైనర్ కలిసి షేర్ చేసారు. ముగ్గురు హీరోలు ఇలా పవర్ ఫుల్ లుక్స్ లో ఫిట్ బాడీ చూపిస్తూ ఫొటో షేర్ చేయడంతో ఈ ఫొటో వైరల్ గా మారింది.

Also Read: Samantha : వాట్.. సమంత మళ్ళీ ఐటెం సాంగ్ చేస్తుందా.. గ్లోబల్ స్టార్ సినిమాలో..?

రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ ఇండో కొరియన్ కామెడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో సమ్మె జరుగుతూ షూటింగ్స్ ఆగిపోయి కాస్త గ్యాప్ దొరకడంతో ఈ ముగ్గురు ఇలా జిమ్ లో కలిసి కష్టపడుతున్నారు. ముగ్గురు మెగా హీరోలు కలిసి కనపడటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Prabhas Sister : ప్రభాస్ చెల్లి ఎంత పని చేసింది.. రాఖీ రోజు అందరితో ఫొటోలు షేర్ చేసి.. నిరాశలో ఫ్యాన్స్..

Exit mobile version