Ram Charan : మన్యం వీరుడిగా మెగా పవర్‌స్టార్.. లుక్ అదిరిందిగా!..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లలో నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. ఈ చిత్రంతో తెలుగు సినిమా సత్తానిమరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి.

Mega Powerstar Ram Charan As Alluri Sita Ramaraju

Ram Charan : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లలో నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. ఈ చిత్రంతో తెలుగు సినిమా సత్తానిమరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి.

ఇప్పటివరకు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల తాలుకు విడుదల చేసిన టీజర్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ రాబట్టుకున్నాయి. రామ్ చరణ్ బర్త్‌డే (మార్చి 27) సందర్భంగా విషెస్ తెలియజేస్తూ.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుండి ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కోసం సర్‌ప్రైజ్ ఇచ్చారు టీమ్..

ఈ సినిమాలో చరణ్ చేస్తున్న అల్లూరి సీతా రామరాజు క్యారెక్టర్‌కి సంబంధించిన పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మన్యం వీరుడి గెటప్‌లో విల్లు ఎక్కుపెడుతున్న మెగా పవర్‌స్టార్ లుక్ కిరాక్ ఉంది. చెర్రీ బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా తీక్షణమైన అతని చూపు ఆకట్టుకుంటోంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ భారీగా విడుదల కానుంది..

Ram Charan