మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘RRR’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం వికారాబాద్ ఫారెస్ట్‌లో చెర్రీ, తారక్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమ్‌స్టర్‌డామ్‌లో ఓ రెస్టారెంట్ బయట నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చాడు చెర్రీ. రెస్టారెంట్ అద్దంపై ‘RAAM’ అనే నేమ్ ఉండడం విశేషం. కళ్లకు అద్దాలతో స్టైలిష్‌గా ఉబర్ కూల్ లుక్‌లో ఉన్న పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ లుక్‌లో చెర్రీ సూపర్బ్‌గా ఉన్నాడు అంటున్నారు మెగా ఫ్యాన్స్.
‘RRR’ లో నటిస్తూనే, మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న ‘చిరు 152’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు చరణ్. ఫిబ్రవరి 7 నుంచి ఈ సినిమా షూటింగ్ కోకాపేటలో జరుగనుంది. ఫిబ్రవరి 18 నుంచి రాజమండ్రిలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.