మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసు.. నాలుగు చిన్న సినిమాలు సేఫ్!

ఇంద్ర సినిమా రీరిలీజ్ అంశాన్ని తెలుసుకున్న చిరంజీవి.. చిన్న చిత్రాల కోసం పెద్ద మనసు చేసుకున్నారని అంటున్నారు.

Mega Star Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దన్నయ్య చిరంజీవి. పరిశ్రమకు కష్టం వస్తే ఆపద్బాంధవుడిలా ఆదుకుంటారు మెగాస్టార్. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించే చిరంజీవి.. చిత్ర సీమ సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటారు. ఇక చిన్న సినిమాలను.. కొత్త నిర్మాతలను ప్రోత్సహించేందుకు ఆయన తీసుకున్న తాజా నిర్ణయం మెగాస్టార్ గౌరవాన్ని మరింత పెంచింది. చిన్న సినిమాలకు ఊపిరిపోస్తూ అన్నయ్య తీసుకున్న నిర్ణయం టాలీవుడ్‌ ప్రశంసలు అందుకుంటోంది.

టాలీవుడ్‌లో ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఉంటాయి. కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ టైంలో చిన్న సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటారు నిర్మాతలు. పెద్ద సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమాలకు థియేటర్లు లభించకపోవడం ఓ సమస్య అయితే.. అగ్ర హీరోల సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాల కలెక్షన్లు బాగా తగ్గిపోతాయనే టెన్షన్ ఒకటి. ఇక ఈ వారం కూడా ఓ నాలుగు చిన్న సినిమాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో పెద్ద హీరోల సినిమాలు ఏవీ లేకపోవడంతో ఆ సినిమాల నిర్మాతలు సంబరం చేసుకున్నారు. ఇంతలో మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఇంద్ర రీరిలీజ్‌కు నిర్మాత భారీ ఏర్పాట్లు చేయడంతో చిన్న చిత్రాల నిర్మాతలు షాక్‌కు గురయ్యారట.

Also Read: వాట్.. సమంత ఇతనితో డేటింగ్‌లో ఉందా.. ఎవరతను? ఆ రూమర్స్ నిజమేనా?

ఇక ఇంద్ర రీరిలీజ్ అంశాన్ని తెలుసుకున్న చిరంజీవి.. చిన్న చిత్రాల కోసం పెద్ద మనసు చేసుకున్నారని అంటున్నారు. తన సినిమా కోసం చిన్న సినిమాకు రిస్క్‌లోకి నెట్టొద్దని భావించారట మెగాస్టార్. ఇంద్ర రీరిలీజ్ చేయకుండా ఆపేయాలని నిర్మాత అశ్వనీదత్‌ను కోరారని టాలీవుడ్‌ టాక్. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర రీరిలీజ్ చేయాలని నిర్ణయించిన నిర్మాత అశ్వనీదత్ మెగాస్టార్ సూచనతో వెనక్కి తగ్గారని సమాచారం. దీంతో 15వ తేదీన రిలీజ్ అవుతున్న నాలుగు చిన్న సినిమాలు సేఫ్ అయ్యాయని అంటున్నారు. ఇంద్ర రీరిలీజ్‌కు చిరంజీవి ఓకే చెబితే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కూడా కష్టమయ్యేదని అంటున్నారు. మొత్తానికి చిరంజీవి మంచి మనసుకు అంతా జేజేలు పలుకుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు