Chiranjeevi : ‘కొరియన్ కనకరాజు’కు మెగాస్టార్ చిరంజీవి విషెస్.. నువ్వులే నవ్వులు..
వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విషెస్ తెలియజేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- August 7, 2026 / 11:34 AM IST
Mega Stra Chiranjeevi wishes to Varun Tej Korean Kanakaraju
Chiranjeevi : మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రితిక నాయక్ కథానాయిక. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం నేడు (ఆగస్టు 7 శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కామెడీ అదిరిపోయిందని అంటున్నారు. తాజాగా చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెబుతూ వరుణ్ తేజ్‌ను అభినందించారు.
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ మెస్మరైజింగ్ ఫోటోలు.. ఈ స్టన్నింగ్ లుక్ వెనుక..
‘ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడ విన్నా నవ్వులే నవ్వులు అనే మాట వినిపిస్తోంది. ప్రియమైన వరుణ్ తేజ్ ఈ విజయానికి నిజంగా నువ్వు అర్హుడివి. నీ కష్టానికి, నిబద్ధతకు తగిన ఫలితం దక్కింది. గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నందుకు చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తాను. ఈ చిత్రం ఇంకా పెద్ద బ్లాక్ బాస్టర్ కావాలని కోరుకుంటున్నాను.’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Hearing wonderful reports about #KoreanKanakaraju.
Everywhere, it’s the same response… “Navvule Navvulu” 😄Dear @IAmVarunTej, you truly deserve this success. Congratulations ❤️
Your hard work and sincerity have paid off.My heartfelt regards to director @GandhiMerlapaka,… pic.twitter.com/PLCpyB6Wse
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 7, 2026
