Sai Dharam Tej : పుట్టిన రోజు నాడు.. సాయి ధరమ్ తేజ్ సంచలన నిర్ణయం.. తెలిస్తే మీరు ప్రశంసిస్తారు
తన పుట్టిన రోజు సందర్భంగా ఓ మంచి పని చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్.

Sai Dharam Tej donates Rs 20 lakhs
Sai Dharam Tej donates Rs 20 lakhs : కొందరు సినీ నటులు తమ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే.. ఇంకొందరు మాత్రం తమ పుట్టిన రోజున ఏదో ఒక మంచి పని చేసి నలుగురికి అండగా నిలవాలని భావిస్తుంటారు. రెండో కోవకే చెందుతాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. నేడు (ఆదివారం అక్టోబర్ 15) తేజ్ బర్త్ డే అన్న సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ మంచి పని చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ సుప్రీం హీరో.
తన పుట్టిన రోజు సందర్భంగా రూ.20 లక్షలు విరాశంగా ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ అధికారుల భార్యలకు రూ.10లక్షలు, తెలుగు రాష్ట్రాల పోలీసులకు రూ.10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ట్వీట్ చేశాడు.
‘నా హీరోల కోసం. ఏదో ఒక మార్పు తీసుకురావడానికే ఇక్కడకు వచ్చాం. నేను నా జీవితంలో మరో సంవత్సరం ముందుకు వెళ్తున్నాను. ఈ సందర్భంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నాను. నా పుట్టిన రోజున వీరనారీలకు అంటే ఆర్మీలో ఉంటూ మన భవిష్యత్తు, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్యలకు రూ.10 లక్షలు విరాళంగా ఇస్తానని మాట ఇస్తున్నాను. ఇంకా.. మనం కోసం ప్రతి రోజు కష్టపడుతున్న రెండు తెలుగు రాష్టాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) పోలీసులకు విరాళంగా రూ.10లక్షలు ఇస్తున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయంలో మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అది మీ విరాళాల రూపంలో కాదు. సైనికులు, ఆర్మీ, పోలీసులు మనకోసం చేస్తున్న పనికి మీరు చూపించే అభిమానం, గౌరవం రూపంలో..’ అని సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లెటర్‌లో తెలిపాడు.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్‌గా మారింది. తేజ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటీజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Suhasini : షూటింగ్‌లో హీరో ఒడిలో కూర్చోమన్నారు.. ఎంగిలి ఐస్‌క్రీమ్ తినమన్నారు
Exercising my responsibility & Paying respect to the ones who sacrifice their today for our tomorrow, EVERYDAY ?♂️
Thank you Indian Army, A P Police & Telangana Police & their ever sacrificing families.@adgpi@TelanganaCOPs @APPOLICE100 pic.twitter.com/tHM6RkTER8
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 15, 2023