Chiranjeevi : కళ్యాణ్ బాబు సినిమా రెండేళ్ల తర్వాత.. ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ పై ‘మెగాస్టార్’ ట్వీట్ వైరల్.. చరణ్ కూడా..

మెగాస్టార్ చిరంజీవి కూడా హరిహర వీరమల్లు ట్రైలర్ చూసి ట్వీట్ చేసారు.

Chiranjeevi Pawan Kalyan

Chiranjeevi : నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజయిన సంగతి తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్ లతో ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్ అదిరిపోవడం, రెండేళ్ల తర్వాత పవన్ సినిమా వస్తుండటంతో సినీ పరిశ్రమలోని పలువురు హరిహర వీరమల్లు ట్రైలర్ పై అభినందనలు తెలియచేస్తూ పోస్టులు చేస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి కూడా హరిహర వీరమల్లు ట్రైలర్ చూసి ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ లో.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. కళ్యాణ్ బాబు సినిమా రెండు సంవత్సరాల తర్వాత స్క్రీన్స్ మీదకు రావడం చాలా ఆనందంగా ఉంది అని తెలుపుతూ హరిహర వీరమల్లు టీంకి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో తమ్ముడి సినిమా కోసం అన్నయ్య చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Sandhya Theatre : మొన్న బన్నీ ఫ్యాన్స్.. ఇవాళ పవన్ ఫ్యాన్స్.. ఇకపై ‘సంధ్య’ థియేటర్లో కష్టమే..

ఇక చరణ్ కూడా బాబాయ్ ట్రైలర్ పై ట్వీట్ చేస్తూ.. ట్రైలర్ సినిమా గ్రాండియర్ ని చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్స్ మీద చూడటం మాకు ఆనందంగా ఉంటుంది అని తెలిపారు. అల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా మై గురు, పవన్ కళ్యాణ్ మామ హరిహర వీరమల్లు ట్రైలర్ సెన్సేషనల్ గా ఉంది. ధర్మం కోసం ఎప్పుడూ పోరాటం చేస్తాడు అని ట్వీట్ చేసాడు.

 

Also Read : Tollywood : టాలీవుడ్ కి 3700 కోట్ల నష్టం.. కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..