Chiranjeevi – Kiran Abbavaram : ఇది కదా సక్సెస్ అంటే.. ‘క’ హిట్ తో కిరణ్ ని పిలిచి మరీ అభినందించిన మెగాస్టార్..

మెగాస్టార్ తో దిగిన ఫోటోలను కిరణ్ సబ్బవరం తన సోషల్ మీడియాలో షేర్ చేసి..

Megastar Chiranjeevi Appreciated Kiran Abbavaram for KA Movie Success

Chiranjeevi – Kiran Abbavaram : కిరణ్ సబ్బవరం క సినిమా ఇటీవల దీపావళికి రిలీజయి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇన్నాళ్లు నెగిటివిటి, ఫ్లాప్స్ చూసిన కిరణ్ ఈ క సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కష్టపడి ఒక కొత్త కథతో ప్రేక్షకులని మెప్పించి హిట్ కొట్టాడు. ప్రేక్షకులను మాత్రమే కాక ఇండస్ట్రీ పెద్దలని కూడా మెప్పించాడు.

Also Read : Lucky Baskhar : ల‌క్కీ భాస్క‌ర్ మూవీ.. వంద కోట్ల‌కు చేరువ‌గా క‌లెక్ష‌న్స్‌.. 10 రోజుల్లో ఎంతంటే?

ఇప్పటికే క సినిమా పెద్ద హిట్ అవ్వడంతో సినీ పరిశ్రమలోని చాలా స్టార్స్, పెద్దలు కిరణ్ ని పిలిచి అభినందించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా క సినిమా చూసి నచ్చడంతో కిరణ్ ని పిలిచి గంట సేపు కూర్చోపెట్టి సినిమా గురించి మాట్లాడి అభినందించారు. దీంతో చిరంజీవితో దిగిన ఫోటోలను కిరణ్ సబ్బవరం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

మెగాస్టార్ తో దిగిన ఫోటోలను కిరణ్ సబ్బవరం తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. బాస్ నుంచి అభినందనలు. థ్యాంక్యూ సో మచ్ చిరంజీవి గారు గంట సేపు మీతో మాట్లాడినందుకు. నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఆశీర్వాదంగా భావిస్తాను సార్ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మెగాస్టార్ సైతం క సినిమా చూసి కిరణ్ ని పిలిచి అభినందించడంతో ఇది కదా సక్సెస్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కిరణ్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు అని అంటున్నారు.