Lucky Baskhar : ల‌క్కీ భాస్క‌ర్ మూవీ.. వంద కోట్ల‌కు చేరువ‌గా క‌లెక్ష‌న్స్‌.. 10 రోజుల్లో ఎంతంటే?

వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో దుల్కర్ స‌ల్మాన్ న‌టించిన మూవీ ల‌క్కీ భాస్క‌ర్‌.

Lucky Baskhar : ల‌క్కీ భాస్క‌ర్ మూవీ.. వంద కోట్ల‌కు చేరువ‌గా క‌లెక్ష‌న్స్‌.. 10 రోజుల్లో ఎంతంటే?

Dulquer Salmaan Lucky Baskhar Movie ten Days Collections here

Updated On : November 10, 2024 / 12:26 PM IST

Lucky Baskhar : వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో దుల్కర్ స‌ల్మాన్ న‌టించిన మూవీ ల‌క్కీ భాస్క‌ర్‌. మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌గా న‌టించిన ఈ మూవీ దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని విజ‌య‌వంతంగా థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. విడుద‌లై దాదాపు రెండు వారాలు కావొస్తున్న‌ప్ప‌టికి కూడా ఈ చిత్ర క‌లెక్ష‌న్స్ స్ట‌డీగా ఉన్నాయి.

10 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ 88.7 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందం తెలియ‌జేసింది. దీపావ‌ళి మెగా బ్లాక్ బాస్ట‌ర్ అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది.

Actress Kasturi : పరారీలో నటి కస్తూరి.. ఇంటికి తాళం, ఫోన్ స్విచ్ఛాఫ్‌!

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ మూవీని నిర్మించారు. స‌చిన్ ఖేడేక‌ర్, సాయికుమార్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

Allu Arjun : ఆ విష‌యం ఎక్కువ‌గా బాధించింది.. ఎలాగైనా సాధించాల‌ని అనుకున్నాను : అల్లు అర్జున్‌

1980-90ల్లో బ్యాంకింగ్ సెక్టార్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. భాస్క‌ర్ అనే ఓ స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి.. కుటుంబ బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌డం కోసం ఎలాంటి రిస్క్ చేశాడ‌నే క‌థాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.