Actress Kasturi : పరారీలో నటి కస్తూరి.. ఇంటికి తాళం, ఫోన్ స్విచ్ఛాఫ్‌!

ప్ర‌ముఖ న‌టి క‌స్తూరి ప‌రారీలో ఉంది.

Actress Kasturi : పరారీలో నటి కస్తూరి.. ఇంటికి తాళం, ఫోన్ స్విచ్ఛాఫ్‌!

Actress Kasturi abscaned

Updated On : November 10, 2024 / 12:06 PM IST

ప్ర‌ముఖ న‌టి క‌స్తూరి ప‌రారీలో ఉంది. చెన్నై పోలీసులు ఆమెకు స‌మ‌న్లు జారీ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. కానీ అక్క‌డ ఇంటికి తాళం వేసి ఉంది. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. దీంతో ఆమె ఎక్క‌డ ఉంద‌నే విష‌య‌మై పోలీసులు గాలింపు చర్య‌లు చేప‌ట్టారు.

ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌స్తూరి.. తెలుగు వారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అని అంది. అధికార పార్టీ డీఎంకే త‌న‌పై కుట్ర చేస్తున్న‌ట్లుగా వివ‌ర‌ణ ఇచ్చింది.

Allu Arjun : ఆ విష‌యం ఎక్కువ‌గా బాధించింది.. ఎలాగైనా సాధించాల‌ని అనుకున్నాను : అల్లు అర్జున్‌

అయిన‌ప్ప‌టికి.. తెలుగు వారిపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై చెన్నై, మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు న‌మోదైయ్యాయి. ఈ క్ర‌మంలో ఆమెను విచారించేందుకు చెన్నై పోలీసులు స‌మ‌న్లు జారీ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్ల‌గా ఆమె ప‌రారీలో ఉన్న‌ట్లు గుర్తించారు. ఆమె త‌మిళ‌నాడు విడిచి వెళ్లి ఉంటార‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.