Allu Arjun : ఆ విషయం ఎక్కువగా బాధించింది.. ఎలాగైనా సాధించాలని అనుకున్నాను : అల్లు అర్జున్
నేషనల్ అవార్డు రాగానే ఫీలింగ్ ఏంటీ ? అని బన్నీని బాలయ్య అడిగారు.

That thing hurt a lot says Allu Arjun in Unstoppable Season 4
Unstoppable Season 4 : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అదరగొడుతున్నారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆహా వేదికగా సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా.. అదిరిపోయే స్పందన వచ్చింది. ఇక ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాలుగో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చారు.
డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప 2 సినిమా విశేషాలను పంచుకున్నారు అల్లు అర్జున్. ఈ క్రమంలో నేషనల్ అవార్డు రాగానే ఫీలింగ్ ఏంటీ ? అని బన్నీని బాలయ్య అడిగారు. తెలుగులో ఒక్కరికి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాకపోవడం తనని బాధించిందని బన్ని చెప్పారు. ఎలాగైనా దాన్ని సాధించాలనుకున్నానని, సాధించానని చెప్పారు.
Unstoppable Season 4 : అల్లు అర్జున్‌కు ఏ విషయంలో ఎక్కువగా కోపం వస్తుందో తెలుసా ?
అమ్మాయిల విషయంలో ఏదైన అన్యాయం జరిగితే తనకు చాలా కోపం వస్తుందని బన్నీ తెలిపారు. మీరు పుష్ప 3 చేయండి నేను అఖండ 3 చేస్తానని బాలయ్యతో బన్ని అన్నారు. మొత్తంగా ప్రొమో అదిరిపోయింది.
బన్నీ పాల్గొన్న ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానున్నట్లుగా తెలుస్తోంది. నవంబర్ 15న ఈ ఎపిసోడ్ పార్ట్ 1 ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.