Unstoppable Season 4 : అల్లు అర్జున్‌కు ఏ విష‌యంలో ఎక్కువ‌గా కోపం వ‌స్తుందో తెలుసా ?

ఎలాంటి సంద‌ర్భాల్లో ఎక్కువగా కోపం వ‌స్తుంద‌ని అల్లు అర్జున్‌ను బాల‌య్య ప్ర‌శ్నించారు.

Unstoppable Season 4 : అల్లు అర్జున్‌కు ఏ విష‌యంలో ఎక్కువ‌గా కోపం వ‌స్తుందో తెలుసా ?

Do you know in what kind of issues most of times Allu Arjun get angry

Updated On : November 10, 2024 / 11:07 AM IST

Unstoppable Season 4 : బాల‌య్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షో ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్ప‌టికే మూడు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. నాలుగో సీజ‌న్ స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. తాజాగా నాలుగో సీజ‌న్‌లో నాలుగో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా వ‌చ్చారు. పుష్ప 2 సినిమా విశేషాల‌తో పాటు జాతీయ అవార్డు అందుకోవ‌డం గురించి బ‌న్నీ మాట్లాడారు.

ఇక ఎలాంటి సంద‌ర్భాల్లో ఎక్కువగా కోపం వ‌స్తుంద‌ని అల్లు అర్జున్‌ను బాల‌య్య ప్ర‌శ్నించారు. ‘నేను బ‌య‌టికి చెప్ప‌క‌పోవ‌చ్చు సార్‌.. అమ్మాయిల విష‌యంలో ఏదైన అన్యాయం జ‌రిగితే నాకు చాలా కోపం వ‌స్తుంది.’ అని అల్లు అర్జున్ అన్నారు.

kidambi srikanth – Shravya Varma : ఆర్జీవీ మేన‌కోడ‌లిని పెళ్లి చేసుకున్న బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ కిదాంబి శ్రీకాంత్..

ఇక చిరంజీవి, మ‌హేశ్‌బాబుల‌తో పాటు తోటీ న‌టీన‌టుల‌తో ఉన్న అనుబంధాన్ని నెమ‌రువేసుకున్నారు.

అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానున్న‌ట్లుగా తెలుస్తోంది. నవంబర్‌ 15న ఈ ఎపిసోడ్‌ పార్ట్ 1 స్ట్రీమింగ్ కానుంది.

Delhi Ganesh : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు ఢిల్లీ గ‌ణేశ్ క‌న్నుమూత‌..