Delhi Ganesh : సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత..
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.

Veteran actor Delhi Ganesh passes away at 80
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి చెన్నైలోని సెంథామిల్ నగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఢిల్లీ గణేశ్ అసలు పేరు గణేశన్. 1 ఆగస్టు 1944లో తమిళనాడులో తిరునెల్వెలిలో ఢిల్లీ గణేశ్ జన్మించారు. 1964 నుంచి 1974 వరకు ఇండియన్ ఎయిర్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేశారు. 1976లో పట్టిన ప్రవేశం మూవీతో తెరగ్రేటం చేశారు.
Shraddha Das : సూర్య ‘కంగువా’ సినిమాలో హీరోయిన్ శ్రద్దా దాస్ ఈ పాట పాడిందని తెలుసా..?
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరించారు. హాస్య పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. స్టార్ హీరోలు కమల్ హాసన్, విజయ్‌కాంత్, రజినీకాంత్ చిత్రాలతో పాటు ఇప్పటి యువ నటులతోనూ ఆయన కలిసి నటించారు.
తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో కలిపి 400లకు పైగా సినిమాల్లో ఆయాన నటించారు. అంతేకాదండోయ్ టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ఆయన చివరిగా ఈ ఏడాది ‘ఆరణ్మనై4’, ‘ఇండియన్2 సినిమాల్లో కనిపించారు.
Pushpa 2 : దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో పుష్ప 2 భారీ ఈవెంట్స్.. ట్రైలర్ లాంచ్ అక్కడే..