ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జూబ్లీ వేడుకకు గెస్ట్‌గా మెగాస్టార్

ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న గోల్డెన్‌జూబ్లీ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి..

  • Published By: sekhar ,Published On : October 25, 2019 / 06:26 AM IST
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జూబ్లీ వేడుకకు గెస్ట్‌గా మెగాస్టార్

Updated On : October 25, 2019 / 6:26 AM IST

ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న గోల్డెన్‌జూబ్లీ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి..

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం.. ‘సైరా’.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రామ్ చరణ్ నిర్మించిన ‘సైరా’ విజయవంతమైన సందర్భంగా.. ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం గురువారం చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. మెగాస్టార్‌ చిరంజీవిని శాలువాతో సత్కరించి, ఫ్లవర్ బొకేలు అందించారు.

ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ 50 సంవత్సరాలు పూర్తయిన విషయాన్ని చిరంజీవికి తెలియచేసి, గోల్డెన్‌జూబ్లీ వేడుకను వైభవంగా నిర్వహించబోతున్నామని, ఈ వేడుకకు మీరు ముఖ్య అతిథిగా రావాలని అసోసియేషన్ కార్యవర్గం చిరంజీవిని కోరగా.. ఆయన వెంటనే ఈ వేడుకకు వస్తానని మాటిచ్చినట్లుగా వారు తెలియజేశారు.

Read Also : వర్మకి ‘వందనం’ : ఎక్కడ పట్టుకొచ్చావయ్యా స్వామీ!

మెగాస్టార్‌ను కలిసినవారిలో ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కొండేటి సురేష్‌, కార్యదర్శి ఇ. జనార్దన్‌రెడ్డి, గోల్డెన్‌జూబ్లీ వేడుక ఛైర్మన్‌ బి.ఎ.రాజు, సీనియర్‌ జర్నలిస్టు ప్రభు, అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు డి.జి.భవాని, సజ్జావాసు, కోశాధికారి భూషణ్‌, సంయుక్త కార్యదర్శులు మడూరి మధు, పర్వతనేని రాంబాబు.. కార్యవర్గ సభ్యులు సాయిరమేష్‌, ముత్యాల సత్యనారాయణ, మురళి (శక్తిమాన్‌), చిన్నమూల రమేష్‌, జిల్లా సురేష్‌ తదితరులు ఉన్నారు.