Chiranjeevi – Balakrishna – Venkatesh : మరోసారి ఒకే వేదికపై సందడి చేసిన చిరు, బాలయ్య, వెంకీ.. ఫ్యాన్స్‌కి పండగే..

తాజాగా ముగ్గురు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మరోసారి కలిసి కనిపించారు.

Megastar Chiranjeevi Balakrishna and Venkatesh on Single Stage at IIFA 2024 Photos goes Viral

Chiranjeevi – Balakrishna – Venkatesh : ఒకరిద్దరు హీరోలు ఒక్కసారి కలిసి కనిపిస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోతుంది. అలాంటిది సీనియర్ స్టార్ హీరోలు ముగ్గురు ఒకేసారి కనిపిస్తే మాములు వైరల్ అవ్వదుగా. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ముగ్గురు హీరోలు కలిసి ఇటీవల బాలకృష్ణ 50 ఏళ్ళ నటన వేడుకల్లో పాల్గొని ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. ఆ ఈవెంట్ నుంచి ముగ్గురు కలిసి ఉన్న వీడియోలు, ఫోటోలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read : Megastar Chiranjeevi : మెగాస్టార్ కి మరో గౌరవం.. అబూ దాబిలో అందుకున్న అవార్డు..

ఆ తర్వాత బాలయ్య బాబు, వెంకీ మామ వెంకటేష్ సినిమా సెట్లో కలిసి అలరించారు. తాజాగా ఈ ముగ్గురు హీరోలు మరోసారి కలిసి కనిపించారు. తాజాగా IIFA వేడుకలు UAE లోని అబుదాబిలో ఘనంగా జరగ్గా టాలీవుడ్ లోని అనేక సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కూడా పాల్గొన్నారు. ముగ్గుర్ని ఒకేసారి స్టేజిపైకి పిలవడంతో ఈవెంట్లో సందడి నెలకొంది. ఒకే స్టేజిపై నుంచి ఈ ముగ్గురి ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

స్టేజి మీద బాలయ్య, చిరు, వెంకీ మామ ఒకర్నొకరు ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ వేడుకలో చిరంజీవికి అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియాన్ సినిమా అవార్డు ఇవ్వడంతో చిరంజీవి ఆ అవార్డుని పట్టుకొని వెంకటేష్, బాలకృష్ణలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. మరోసారి ఈ ముగ్గురు కలిసి కనిపించడంతో ఫ్యాన్స్, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోల్లో నాగార్జున కూడా ఉంటే బాగుండేది అని అంటున్నారు.