Megastar Chiranjeevi Celebrates Hero Srikanth Birthday at his Home Photos goes Viral
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కోట్లలో అభిమానులు ఉన్నారని తెలిసిందే. సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు కూడా చిరంజీవికి అభిమానులే. అలాంటి వాళ్ళల్లో శ్రీకాంత్(Srikanth) ఒకరు. హీరో శ్రీకాంత్ చిరంజీవిని అన్నయ్య అంటూ పిలుస్తారు. చిరంజీవి కూడా తమ్ముడు అని వాళ్ళ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉంటారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి శంకర్ దాదా mbbs, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో కలిసి నటించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ వేసిన ATM పాత్ర బాగా హిట్ అయింది.
తాజాగా నేడు శ్రీకాంత్ పుట్టిన రోజు కావడంతో చిరంజీవి స్వయంగా శ్రీకాంత్ ఇంటికి కేక్ తీసుకొని వెళ్లి కేక్ కట్ చేయించి తినిపించారు. అనంతరం శ్రీకాంత్ ఫ్యామిలీతో సరదాగా కాసేపు గడిపారు. శ్రీకాంత్ ఫ్యామిలీతో ఫోటోలు దిగారు. కేక్ మీద హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య అని రాయించడం విశేషం. శ్రీకాంత్ బర్త్ డేని చిరంజీవి స్వయంగా వెళ్లి సెలబ్రేట్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Oppenheimer : ఆస్కార్ విన్నింగ్ సినిమా ఓపెన్ హైమర్.. ఇప్పుడు తెలుగులో కూడా చూడొచ్చు.. ఎక్కడంటే..?
ఈ విషయంలో చిరంజీవిని అంతా అభినందిస్తుండగా శ్రీకాంత్, చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం మరోసారి వైరల్ అవుతుంది. ఇక పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు శ్రీకాంత్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
The Dada-ATM combo was clicked as the Mega Star @KChiruTweets visited @actorsrikanth 's home to celebrate the actor’s birthday! ??#Chiranjeevi #MegastarChiranjeevi #ActorSrikanth #RoshanMeka pic.twitter.com/mk7YNRhDOX
— BA Raju's Team (@baraju_SuperHit) March 23, 2024