Chiranjeevi – Guinness Records : మొదటి సినిమా రిలీజయిన రోజే గిన్నిస్ రికార్డు అందుకున్న చిరంజీవి.. సరిగ్గా 46 ఏళ్ళ తర్వాత..

అనుకోకుండా గిన్నిస్ రికార్డుకు చిరంజీవికి ఏదో అనుబంధం ఉంది అని ఫ్యాన్స్, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Megastar Chiranjeevi Co Incidence with Guinness World Records in Some Interesting Facts

Chiranjeevi – Guinness Records : మెగాస్టార్ చిరంజీవి నిన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు అందుకున్న సంగతి తెలిసిందే. 156 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు ఈ రికార్డుని సాధించారు చిరు. ఈ అవార్డును బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అందుకున్నారు.

ఈ అవార్డును నిన్న సెప్టెంబర్ 22న అందుకున్నారు చిరంజీవి. అయితే చిరంజీవి మొదటి సినిమా రిలీజయింది కూడా సెప్టెంబర్ 22నే. 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. సరిగ్గా 46 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే డేట్ లో చిరంజీవి గిన్నిస్ రికార్డ్ అందుకోవడం విశేషమనే చెప్పాలి.

Also See : Megastar Chiranjeevi : గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్న చిరంజీవి.. ఈవెంట్ ఫొటోలు వైరల్..

అలాగే మరో ఆసక్తికర విషయం కూడా నెలకొంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాపించి మొదట పబ్లిష్ జరిగింది ఆగస్టులోనే. 1955 ఆగస్టులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొదలయి మొదటి పబ్లిష్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కూడా అదే సంవత్సరం 1955 ఆగస్టులోనే పుట్టడం గమనార్హం.

గిన్నిస్ రికార్డ్ మొదలు పెట్టిన సంవత్సరం, అదే నెలలో చిరంజీవి పుట్టడం, తన మొదటి సినిమా రిలీజయిన డేట్ కి 46 ఏళ్ళ తర్వాత గిన్నిస్ రికార్డ్ అందుకోవడం.. ఇలా అనుకోకుండా గిన్నిస్ రికార్డుకు చిరంజీవికి ఏదో అనుబంధం ఉంది అని ఫ్యాన్స్, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.