×
Ad

Chiranjeevi : మీరు లేనిదే నేను లేను.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..

చిరంజీవి కృతజ్ఞతతో ఎమోషనల్ ట్వీట్ చేసారు. (Chiranjeevi)

Chiranjeevi

  • మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్
  • చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
  • అందర్నీ ఉద్దేశించి ట్వీట్

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో, నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలో డ్యాన్సులు, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నిట్లో వింటేజ్ చిరంజీవిని చూపించడంతో ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.(Chiranjeevi)

ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు సినిమా 300 కోట్ల గ్రాస్ దాటేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా ఇంత భారీ విజయం సాధించడంతో చిరంజీవి కృతజ్ఞతతో ఎమోషనల్ ట్వీట్ చేసారు.

Also Read : Allu Arjun : మామ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ..

చిరంజీవి తన ట్వీట్ లో.. మన శంకరవరప్రసాద్ గారు చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది.

వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి – పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు & సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో… లవ్ యూ ఆల్.. మీ చిరంజీవి అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసారు. దీంతో ఫ్యాన్స్ చిరంజీవి ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.

Also Read : Sharwanand : ఆ సినిమాల్లో నన్ను చూసి నాకే ఛీ అనిపించింది.. ఆ యాక్సిడెంట్ తర్వాత.. శర్వానంద్ కామెంట్స్ వైరల్..