ఐమ్యాక్స్ ప్రసాద్‌ను పరామర్శించిన చిరు

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి మృతికి నివాళులు అర్పించిన మెగాస్టార్ చిరంజీవి..

  • Publish Date - October 18, 2019 / 08:48 AM IST

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి మృతికి నివాళులు అర్పించిన మెగాస్టార్ చిరంజీవి..

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి, శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి గురువారం ఉదయం పరమపదించిన సంగతి తెలిసిందే.. హార్ట్ ఎటాక్ కారణంగా నిద్రలో ఆమె తుదిశ్వాస విడిచారు.

విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రమేష్ ప్రసాద్ నివాసానికి వెళ్లి ఆమెకు నివాళులు అర్పించి, ప్రసాద్‌ను పరామర్శించారు.

విజయలక్ష్మీ మృతికి తన సంతాపం తెలిపారు. రమేష్ ప్రసాద్‌తో 1963 జూలైలో విజయలక్ష్మీ వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.