Pawan Kalyan Son : పవన్ కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి క్లారిటీ.. ఇప్పుడు ఎలా ఉందంటే.. చిరు ట్వీట్ వైరల్..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ట్వీట్ చేసారు.

Megastar Chiranjeevi gives Clarity on Pawan Kalyan Son Mark Shankar Health

Pawan Kalyan Son : ఇటీవల రెండు రోజుల క్రితం సింగపూర్ లో చదువుకుంటున్న పవన్ కళ్యాణ్ రెండో కొడుకు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకొని గాయాలపాలయి హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్, చిరంజీవి, చిరంజీవి భార్య మార్క్ శంకర్ ని చూడటానికి సింగపూర్ వెళ్లారు. గత మూడు రోజులుగా మార్క్ శంకర్ హాస్పిటల్ లోనే ఉండి చికిత్స తీసుకున్నాడు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ట్వీట్ చేసారు.

Also Read : Good Bad Ugly Review : అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ రివ్యూ.. ఫ్యాన్స్ కి మాత్రం పండగే..

పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద  ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ  సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా  ప్రాంతాల్లో మార్క్  శంకర్  కోలుకోవాలని ప్రతి  ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అంటూ ట్వీట్ చేసారు చిరంజీవి. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

మళ్ళీ చాలా రోజుల తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే ఫొటోలో కనపడటంతో ఈ ఫోటో కూడా వైరల్ అవ్వగా మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.