Good Bad Ugly Review : అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ రివ్యూ.. ఫ్యాన్స్ కి మాత్రం పండగే..

అజిత్ ఫ్యాన్స్ కి అయితే తెగ నచ్చేస్తుంది.

Good Bad Ugly Review : అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ రివ్యూ.. ఫ్యాన్స్ కి మాత్రం పండగే..

Ajith Kumar Trisha good bad ugly Movie Review and Rating

Updated On : April 10, 2025 / 6:41 PM IST

Good Bad Ugly Movie Review : అజిత్, త్రిష జంటగా తెరకెక్కిన సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రసన్న, సునీల్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్లీ, అర్జున్ దాస్, యోగిబాబు, ప్రియా ప్రకాష్ వారియర్, జాకీ ష్రాఫ్, సిమ్రాన్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నేడు ఏప్రిల్ 10న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. రెడ్ డ్రాగన్ అలియాస్ AK (అజిత్ కుమార్) ఒక పెద్ద డాన్. తనకు కొడుకు పుట్టడంతో తన కొడుకుని చూడ్డానికి వెళ్తాడు. కానీ భార్య(త్రిష) ఆ గ్యాంగ్ స్టార్ జీవితం వదిలేసి, ఆ మచ్చలు లేకుండా వస్తేనే కొడుకు దగ్గరికి రా లేకపోతే వద్దు అంటుంది. దీంతో భార్యాపిల్లల కోసం గ్యాంగ్ స్టార్ జీవితం మొత్తం పోవాలని లొంగిపోయి జైలుకు వెళ్తాడు. తన భార్య, కొడుకు స్పెయిన్ లో దూరంగా ఉంటారు. కొడుకుతో అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడుతూ తను బిజినెస్ మెన్ అని, బిజీగా ఉన్నానని చెప్తూ ఉంటాడు AK.

కొడుకు విహాన్(కార్తీక్ దేవ్) 18 వ పుట్టిన రోజుకి ఎలాగైనా కలుస్తానని మాట ఇస్తాడు AK. జైలు నుంచి ముందే రిలీజ్ అయి తన కొడుకు విహాన్ ని కలవడానికి స్పెయిన్ కి వెళ్తాడు AK. కానీ అదే సమయానికి విహాన్ ని ఎవరో ట్రాప్ చేసి డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయిస్తారు. అంతే కాకుండా విహాన్ గర్ల్ ఫ్రెండ్ ని కూడా చంపేస్తారు. అసలు AK రెడ్ డ్రాగన్ గా ఎలా మారాడు? జైలు నుంచి ఎలా బయటికి వచ్చాడు? AK కొడుకుని ఎవరు ట్రాప్ చేశారు? విహాన్ గర్ల్ ఫ్రెండ్ ని ఎందుకు చంపేశారు? ఫ్యామిలీ కోసం AK ఏం చేశాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Renu Desai : హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతున్నాయి.. డబ్బులు లేవు.. ఆ దేవుడికి దండం పెట్టాను.. నెక్స్ట్ డే..

సినిమా విశ్లేషణ.. గత కొన్నాళ్లుగా అజిత్ సీరియస్ గా సినిమాలు తీయట్లేదు అని, సింపుల్ స్క్రిప్ట్ తో ఎలివేషన్స్ తో కేవలం ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తున్నాడని అందరూ అంటున్నారు. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా కేవలం ఫ్యాన్స్ కోసమే తీసినట్టు ఉంటుంది. ఒక పెద్ద డాన్ తన ఫ్యామిలీ కోసం తన గతాన్ని వదిలేసి మారుతాడు. తన ఫ్యామిలీని కలిసే లోపే తన ఫ్యామిలీకి ఒక ప్రమాదం వస్తే మళ్ళీ ఎలా డాన్ గా మారాడు అనేది గతంలో చాలా సినిమాలు చూసాం. ఇది కూడా అదే కథ.

ఫస్ట్ హాఫ్ అంతా ఏకే కి ఎలివేషన్స్, ఏకే ఫ్యామిలీ స్పెయిన్ లో ఉండటం, కొడుకు కోసం జైలు నుంచి వెళ్తే కొడుకు జైలుకు వెళ్లడం, కొడుకుని ట్రాప్ చేసిన వాళ్ళని పట్టుకోవడంతో సాగుతుంది. సెకండ్ హాఫ్ ఏకే ఫ్లాష్ బ్యాక్ అని అజిత్ పాత డాన్ సినిమాల ఎలివేషన్స్, కొన్ని ఇంటర్నేషనల్ విలన్స్ ఎలివేషన్స్ చూపించే సీన్స్ అన్ని బాగుంటాయి. ఫ్యాన్స్ కి మాత్రం సెకండ్ హాఫ్ ఫుల్ పండగే. అజిత్ ని వింటేజ్ లుక్స్ లో బాగా చూపించారు. పాత అజిత్ సినిమాల సాంగ్స్, ఎలివేషన్స్, అజిత్ పాత డాన్ సినిమాలతో కనెక్షన్స్ ఇచ్చి మంచి హై ఫీల్ ఇచ్చారు. ప్రీ ఇంటర్వెల్ ముందు, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు బాగుంటాయి. కథ పరంగా రెగ్యులర్ సినిమా అయినా అజిత్ ఫ్యాన్స్ కి మాత్రం మంచి కిక్ ఇచ్చే సినిమా. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అజిత్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే ఛేజింగ్, గన్స్.. అవన్నీ ఇందులో కూడా కొనసాగించాడు.

good bad ugly

నటీనటుల పర్ఫార్మెన్స్.. అజిత్ ఎప్పటిలాగే యాక్షన్ సీన్స్ తో ఎలివేషన్స్ తో అదరగొట్టాడు. త్రిష అక్కడక్కడా క్యూట్ గా కనిపిస్తుంది. అజిత్ తనయుడిగా తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ కార్తీక్ దేవ్ బాగా నటించాడు. సునీల్ అజిత్ రైట్ హ్యాండ్ గా సీరియస్ పాత్రలో బాగానే మెప్పించాడు. అర్జున్ దాస్ విలన్ గా ఓ కొత్త పాత్రలో అదరగొట్టాడు. ప్రసన్న, ప్రభు, రెడిన్ కింగ్స్లీ, యోగిబాబు, ప్రియా ప్రకాష్ వారియర్, జాకీ ష్రాఫ్, సిమ్రాన్… మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Jack : ‘జాక్’ మూవీ రివ్యూ.. సిద్ధూ జొన్నలగడ్డ స్టైల్ లో స్పై థ్రిల్లర్..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ కొత్తగా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు. సాంగ్స్ మాత్రం యావరేజ్. యాక్షన్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేసారు. గన్స్, కార్స్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ కథ పాతది తీసుకున్న డైరెక్షన్ తో అజిత్ ఫ్యాన్స్ ని మెప్పించాడు. నిర్మాణ పరంగా మన తెలుగు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తానికి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఓ డాన్ తన ఫ్యామిలీ కోసం ఏం చేసాడు అని యాక్షన్, ఎలివేషన్స్ తో తీశారు. అజిత్ ఫ్యాన్స్ కి అయితే తెగ నచ్చేస్తుంది. మిగతా వారికి కష్టమే. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.