Chiranjeevi : చరణ్ కూతురు ఎంట్రీ.. మెగాస్టార్‌కు ఎంత మంది మనవరాళ్లో తెలుసా..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే..చిరంజీవికి ఎంత మంది మనరాళ్లు ఉన్నారు అనే ప్రశ్న ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 30, 2023 / 04:18 PM IST
Chiranjeevi Granddaughters
Chiranjeevi Granddaughters : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉపాసన మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకి జన్మినిచ్చింది. ఇప్పటికే ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తమకెంతో ఇష్టమైన మంగళవారం రోజే చిన్నారి జన్మించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చినట్లు చెప్పారు.
Pawan Kalyan : మెగా వారసురాలి పై పవన్ ట్వీట్
వివాహామైన దాదాపు 11 సంవత్సరాల తరువాత రామ్‌చరణ్-ఉపాసనలు తల్లిదండ్రులు కావడంతో చిరంజీవి మరోసారి తాత అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా.. చిరుకి ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ కొడుకు రామ్‌చరణ్ అన్న సంగతి తెలిసిందే. అయితే..చిరంజీవికి ఎంత మంది మనరాళ్లు ఉన్నారు అనే ప్రశ్న ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ విషయం తెలుసుకోవాలని నెటీజన్లు నెట్టింట తెగ వెతికేస్తున్నారు.
చిరంజీవికి ఇప్పటికే నలుగురు మనవరాళ్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుకు చేరింది. పెద్ద కూతురు సుష్మితకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇందులో ఒకమ్మాయి పేరు సమర కాగా మరొకరి పేరు సంహిత.
Ram Charan- Upasana: మెగా కుటుంబంలో సంబరాలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
Sushmita daughters
ఇక రెండో అమ్మాయి శ్రీజకు సైతం ఇద్దరు ఆడపిల్లలు. వారి పేర్లు నివృత్తి, నవిష్క.
Srija Daughters
ఇక కుమారుడు రామ్‌చరణ్‌కు సైతం నేడు(జూన్ 20)ఆడబిడ్డే కలగడంతో చిరంజీవికి మొత్తం ఐదుగురు మనవరాళ్లు అయ్యారు.
