Ram Charan- Upasana: మెగా కుటుంబంలో సంబరాలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Ram Charan- Upasana: మెగా కుటుంబంలో సంబరాలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

Mega Family

Updated On : June 30, 2023 / 4:19 PM IST

Konidela Ram Charan : ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడోతరం అడుగిడింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో, మెగా ఫ్యాన్స్‌లో సంబురాలు మిన్నంటాయి. మెగా ఫ్యాన్స్ అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకొని, ఆసుపత్రి బయట అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Upasana : డెలివరీ కోసం హాస్పిటల్‌కి చేరుకున్న ఉపాసన.. రేపే మెగా వారసత్వం ఎంట్రీ..

రామ్ చరణ్ – ఉపాసనలు 2012 సంవత్సరంలో వివాహం చేసుకున్న విషయం విధితమే. చాలాకాలం తరువాత వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు. గతేడాది డిసెంబర్ 12న ఇరు కుటుంబాలు వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించాయి.

Upasana : ఉపాసన బిడ్డకి ఉయ్యాల రెడీ.. ఎవరు తయారు చేశారో తెలుసా..?

ఇదిలాఉంటే. ఉపాసన డెలివరీకోసం సోమవారమే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె వెంట రామ్ చరణ్, సురేఖ (చిరంజీవి సతీమణి) కూడా ఉన్నారు. కొన్నిరోజులు నుంచి రామ్ చరణ్ షూటింగ్స్ గ్యాప్ ఇచ్చారు. ఆగష్టు వరకు షూటింగ్స్‌లో పాల్గొనడని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే, బిడ్డ పుట్టిన తరువాత చరణ్ అండ్ ఉపాసన చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవ్వనున్నట్లు ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. గ్రాండ్ పేరెంట్స్ అయిన చిరంజీవి, సురేఖ సంరక్షణలోనే తమ బిడ్డని పెంచాలని భావిస్తున్నట్లు ఉపాసన ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది.