మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిరు 152 షూటింగ్ డిసెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కానుంది..
సీనియర్ హీరోలు యంగ్ హీరోలకు సవాల్ విసురతున్నారు.. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ వంటి పెద్ద హీరోలు తమ కొత్త సినిమాల కోసం ఈ వయసులోనూ విపరీతంగా కష్టపడుతూ.. సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. ‘సైరా’ తర్వాత చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం గంటల తరబడి జిమ్‌లో కష్ట పడుతున్నారు.
చిరు హార్డ్ వర్క్ చూసి అభిమానులు, సినీ జనాలు ఆశ్చర్య పోతున్నారు. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదు.. ఇప్పటికే ఆయన ఈ మూవీ కోసం బరువు తగ్గి సన్నగా తయారయ్యారు. ఇప్పుడు మరింత ఫిట్‌గా కనపడటానికి కసరత్తులు చేస్తున్నారు. చిరంజీవి జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : ఢిల్లీ మళ్లీ వస్తున్నాడు : ఖైదీ 2 కాన్సెప్ట్ పోస్టర్
ఇటీవల పర్సనల్ పని మీద అమెరికా వెళ్లారు చిరంజీవి.. ఆయన తిరిగి రాగానే డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.. చిరు 152వ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్‌తో పాటు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.