Chiranjeevi : నాటి ప్రజారాజ్యం పార్టీ నేడు జనసేనగా రూపాంతరం చెందింది- చిరంజీవి హాట్ కామెంట్స్

చిరంజీవిని చూడగానే ఫ్యాన్స్ అంతా జై జనసేన అంటూ నినాదాలు చేశారు. దాంతో చిరంజీవి కూడా జై జనసేన అంటూ నినదించారు.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. చాలా రోజుల తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవిని చూడగానే ఫ్యాన్స్ అంతా జై జనసేన అంటూ నినాదాలు చేశారు.

దాంతో చిరంజీవి కూడా జై జనసేన అంటూ నినదించారు. అదే సమయంలో, నాటి ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేనగా మారింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. దీంతో ఫ్యాన్స్ ఆనందంతో కేకలు వేశారు.

”విశ్వక్ తండ్రి కరాటే రాజు నాకు చాలా ఏళ్ల కింద నుంచే పరిచయం. అప్పట్లో ప్రజారాజ్యంలో ఉన్నారు. జై జనసేన.. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందింది. ఐయామ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్ గా తను రావాలని, ఎదగాలని తన ఇంట్రస్ట్ ఆయన చెప్పినప్పుడు నేను వెంటనే ప్రజారాజ్యం నుంచి ఆయనకి అవకాశం ఇచ్చాను.

Also Read : స‌ల్మాన్ ఖాన్ రోజుకు ఎన్ని గంట‌లు ప‌డుకుంటాడో తెలుసా?

అప్పటి నుంచి రాజు నాతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. వాళ్ల అబ్బాయి సినిమాల్లోకి వస్తాడని కూడా చెప్పారు. నేను ఒకసారి వాళ్ల ఇంటికి అయ్యప్ప పూజకు వెళ్లాను. అప్పుడు విశ్వక్ చాలా చిన్నవాడు అనుకుంటా” అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 18 సీట్లు కూడా గెలుచుకున్నారు. మొత్తం ఓట్లలో 18శాతం ఓట్లు ప్రజారాజ్యం దక్కించుకుంది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు. తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానలో గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.

 

చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2011 ఆగస్టులో పీఆర్పీని జాతీయ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. 2011 ఫిబ్రవరి 6న సోనియాగాంధీతో భేటీ అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు చిరంజీవి. అప్పటినుంచి చిరంజీవి ఎప్పుడూ కూడా ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చింది లేదు. ఇప్పుడు అనూహ్యంగా ఓ సినిమా ఈవెంట్ లో ఆయన మళ్లీ ప్రజారాజ్యం ప్రస్తావన తీసుకురావడం.. నాటి ప్రజారాజ్యమే నేడు జనసేనగా రూపాంతరం చెందిందని కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

 

ప్రజారాజ్యం పార్టీతో పవన్ కల్యాణ్ కు ప్రత్యేక అనుబంధమే ఉంది. తన అన్నయ్యకు అండగా ప్రజారాజ్యం పార్టీ తరఫున 2008లో విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు పవన్ కల్యాణ్. అయితే, చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో పవన్ రాజకీయాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.

Also Read : బాలకృష్ణ ఫ్యాన్ సినిమా అయితే నేను రాకూడదా? హీరోలు బానే ఉంటారు ఫ్యాన్సే కొట్టుకుంటున్నారు- చిరంజీవి హాట్ కామెంట్స్

ఇక, పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సూపర్ హిట్ కొట్టింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది.