Chiranjeevi : బాలకృష్ణ ఫ్యాన్ సినిమా అయితే నేను రాకూడదా? హీరోలు బానే ఉంటారు ఫ్యాన్సే కొట్టుకుంటున్నారు- చిరంజీవి హాట్ కామెంట్స్
నేను ఈ ఫంక్షన్ కు వస్తున్నప్పుడు విశ్వక్ సేన్ వేరే కాంపౌండ్ కదా అన్నారు. వేరే కాంపౌండ్ అయితే నేను ఎందుకు రాకూడదు.

Chiranjeevi : విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి సినీ నటుల ఫ్యాన్స్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోలు బానే ఉంటారు.. ఫ్యాన్సే కొట్టుకుంటున్నారు అని చిరంజీవి అన్నారు. అంతేకాదు.. బాలకృష్ణ ఫ్యాన్ సినిమా అయితే నేను రాకూడదా? అని చిరంజీవి ప్రశ్నించారు. ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్ అని చిరంజీవి స్పష్టం చేశారు.
ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కుటుంబసభ్యులుగా ఉంటారు..
ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కుటుంబసభ్యులుగా ఉంటారని చెప్పారు. తాను మొదటి నుంచి ఇండస్ట్రీలో అందరూ కలిసి ఉండేలా కృషి చేస్తూనే ఉన్నానని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఒక సినిమా ఆడితే వందల మంది బాగుంటారని కామెంట్ చేశారు. పుష్ప 2 సినిమా ఆడితే గర్వపడ్డానని చిరంజీవి చెప్పారు.
Also Read : పుష్ప 2 థ్యాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ భావోద్వేగభరిత కామెంట్స్.. కంటతడి..
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సమ్మర్ నుంచి స్టార్ట్..
”నేను ఈ ఫంక్షన్ కు వస్తున్నప్పుడు విశ్వక్ సేన్ వేరే కాంపౌండ్ కదా అన్నారు. వేరే కాంపౌండ్ అయితే నేను ఎందుకు రాకూడదు. లైలా సినిమా పెద్ద హిట్ అవుతుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నేను నటిస్తాను. ఆ సినిమా సమ్మర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కోదండరామిరెడ్డితో నాకు ఎలాంటి కెమిస్ట్రీ ఉందో అనిల్ రావిపూడితో అలాంటి అనుబంధం ఉంది” అని చిరంజీవి అన్నారు.
మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం..
ఇలాంటి ఫంక్షన్స్ కు వస్తే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి నువ్వు వెళ్తున్నావా.. అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ కాంపౌండ్.. అప్పుడప్పుడు తారక్ అంటాడు.. అంటూ కొన్ని మాటలు వినిపించాయి. నేను ఒకటే చెప్పా.. మనుషులన్నాక వేరే వాళ్ల మీద ప్రేమ, అభిమానం ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఫర్ ఎగ్జాంపుల్.. మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన వాడి ఫంక్షన్ కు నేను వెళ్లకూడదా? వాడితో కలిసి ఉండకూడదా? కలిసి భోజనం చేయకూడదా? వాడిని నేను దూరంగా పెడతానా?
మొన్న విశ్వక్ సేన్ ని ఇలానే ఎవరో అడిగారు. ఆ క్లిప్ నేను చూశాను. మీరు బాలృష్ణ కాంపౌండ్ కదా.. మెగా కాంపౌండ్ లోకి వెళ్తున్నారేంటి అని అడిగారు. దానికి విశ్వక్ సేన్ చాలా చక్కని సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదని విశ్వక్ సేన్ చాలా చక్కగా చెప్పాడు. నా చిన్ననాటి రోజుల నుంచి ఆ కాంపౌండ్ల గోల ఉంది. కానీ అది షూటింగ్‌ల వరకే.. హీరోలంతా బాగానే ఉంటారు. కానీ అభిమానులే కొట్టుకు చచ్చే వాళ్లు. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ.. మేమంతా కలుసుకుంటూనే ఉంటాం. అభిమానం అనేది పర్సనల్. మన మనిషి కాదని దూరం పెట్టడం కరెక్ట్ కాదు.
Also Read : సల్మాన్ ఖాన్ రోజుకు ఎన్ని గంటలు పడుకుంటాడో తెలుసా?
హీరోలంతా ఒక్కటే, అందరూ ఇండస్ట్రీలో భాగమే అని మేసేజ్ ని స్ప్రెడ్ చేయాలి. మన ఇమేజ్, ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప.. మనల్ని మనం దూరం చేసుకోవడం కాదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. పుష్ప 2 పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి నేను గర్విస్తాను. ఇండస్ట్రీలో ఒక సినిమా బాగా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఒక సినిమా ఆడిందంటే ఎంతోమంది కార్మికుల జీవితాలు వెలుగులు నిండుతాయి” అని చిరంజీవి అన్నారు.