Allu Arjun: పుష్ప 2 థ్యాంక్స్‌ మీట్‌లో అల్లు అర్జున్ భావోద్వేగభరిత కామెంట్స్‌.. కంటతడి..

సుకుమార్‌ ముందే అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యాడు.

Allu Arjun: పుష్ప 2 థ్యాంక్స్‌ మీట్‌లో అల్లు అర్జున్ భావోద్వేగభరిత కామెంట్స్‌.. కంటతడి..

Allu Arjun

Updated On : February 9, 2025 / 10:52 AM IST

పుష్ప 2 థ్యాంక్స్‌ మీట్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆయన కంటతడి పెట్టుకున్నాడు. హైదరాబాద్‌లో ఈ థ్యాంక్స్‌ మీట్ నిర్వహించారు.

ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తమ అందరికీ దక్కిన ఈ సక్సెస్‌ ఘనత అంతా సుకుమార్‌దేనని అన్నాడు. సుకుమార్‌ ఓ మాట అంటున్నారని, అది తన మనసులో ఉందని చెప్పాడు.

పుష్ప 2లోని తన ఫెర్ఫార్మన్స్‌కి మంచి పేరు వస్తుందని చాలా మంది చెప్పారని అన్నాడు. తన లైఫ్‌లో సుకుమార్‌ లేకపోతే సినిమా లేదని వ్యాఖ్యానించాడు. తనతో పాటు పుష్ప సినిమా కోసం పనిచేసిన వారందరికీ పేరు పేరునా థ్యాంక్స్‌ చెబుతున్నట్లు తెలిపాడు.

Also Read: యువ క్రికెటర్లకు పండుగలాంటి వార్త.. తెలంగాణ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది..

“ఒక సినిమాలో ఒక పాట బాగున్నా.. లిరిక్ బాగున్నా.. ఏది బాగున్నా ఇది డైరెక్టర్‌ ఇచ్చిన స్పేస్‌ వల్ల మాత్రమే. సినిమాలో ఏదైనా బాగుందంటే అది ఆర్టిస్టు, టెక్నీషియన్‌ గొప్పదనం కాదు. అది డైరెక్టర్ గొప్పదనం మాత్రమే. నా పెర్ఫార్మన్స్‌ బాగుందంటే దాని వెనుక సుకుమార్‌ ఉన్నారు. హీ లవ్స్‌ పెర్ఫార్మన్స్‌” అని చెప్పాడు.

తన కెరీర్ గ్రాఫ్ చూస్తే సుకుమార్ లేకుండా ఏముందనేది ఊహించుకోలేనని అన్నాడు. పుష్ప, పుష్ప 2 సినిమాలను సుకుమార్‌ తెరకెక్కించినందుకే ఈ రేంజ్‌లో సక్సెస్‌ అయ్యాయని తెలిపాడు. ఈ క్రమంలో సుకుమార్‌ స్టేజీ మీదకు వెళ్లి అల్లు అర్జున్‌ను హత్తుకున్నారు.