Chiranjeevi: మెగాస్టార్‌ను ఫిదా చేసిన శ్రీనివాస్ మాయ కథ.. సుకుమార్ శిష్యుడికి బంపర్ ఆఫర్.. రంగస్థలాన్ని మించి ఉంటుందా?
సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).
- V Santhosh Kumar
- Published On : March 13, 2026 / 07:49 AM IST
Megastar Chiranjeevi is making a film with Sukumar assistant srinivas maya
- మెగాస్టార్ తో సినిమా ప్లాన్ చేస్తున్న సుకుమార్ శిష్యుడు
- రా అండ్ రస్టిక్ కంటెంట్ తో సరికొత్తగా
- రంగస్థలం సినిమాకు మించి ఎమోషన్స్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిరు త్వరలో ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తరువాత యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో క్రేజీ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన ఒక కథ మెగాస్టార్‌ను అమితంగా ఆకట్టుకుందట. సుకుమార్ స్కూల్ నుండి వచ్చే దర్శకులకు సహజత్వంతో కూడిన కథలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించే నైపుణ్యం ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ మాయ కూడా అదే బాటలో చిరంజీవి(Chiranjeevi) కోసం ఒక పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీని సిద్ధం చేశాడట.
Prem Rakshith: మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ఫిదా.. ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌కు గ్లోబల్ సెల్యూట్
ఈ కథ విన్న వెంటనే మెగాస్టార్‌కు ‘రంగస్థలం’ వైబ్స్ గుర్తుకు వచ్చాయట. రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో, పల్లెటూరి వాతావరణంలో సాగే ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ కథ ఉండబోతోందని సమాచారం. చిరంజీవి గతంలో మాస్ చిత్రాలు చేసినప్పటికీ పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా చేసి చాలా కాలమైంది. అందుకే, శ్రీనివాస్ మాయ చెప్పిన కథలోని సహజత్వం, పాత్రల చిత్రణ చిరంజీవికి బాగా నచ్చాయట. అందుకే, కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉందట. సుకుమార్ శిష్యుడు కావడంతో మేకింగ్ విషయంలో కూడా సుకుమార్ పర్యవేక్షణ, సలహాలు ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి, విలేజ్ సెటప్‌లో చిరంజీవి మార్క్ మ్యానరిజమ్స్, మాస్ డైలాగ్స్ తో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా చెప్పుకోవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే, త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారట. మరి చాలా కాలం తరువాత మెగాస్టార్ నటించే ఈ రా అండ్ రస్టిక్ మూవీ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.
