తొలిచిత్ర దర్శకుడి మరణం – మెగాస్టార్ సంతాపం

రాజ్ కుమార్ మృతి తీరని లోటు - మెగాస్టార్ చిరంజీవి..

  • Published By: sekhar ,Published On : February 15, 2020 / 10:20 AM IST
తొలిచిత్ర దర్శకుడి మరణం – మెగాస్టార్ సంతాపం

Updated On : February 15, 2020 / 10:20 AM IST

రాజ్ కుమార్ మృతి తీరని లోటు – మెగాస్టార్ చిరంజీవి..

దర్శకుడు రాజ్ కుమార్ మృతి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ : ‘‘రాజ్ కుమార్ నన్ను కలసి  తన దర్శకత్వంలో వస్తున్న ‘‘పునాది రాళ్లు”సినిమాలో వేషం వెయ్యమని అడిగారు.

అప్పుడు నేను ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్నాను పూర్తి కాకుండా ఎలా అన్నా కూడా బలవంతంగా.. నువ్వే చేయాలి అని నాతో చేయించడం జరిగింది. అలా ‘పునాది రాళ్లు’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. నా నట జీవితానికి అదే ‘పునాది రాళ్లు’ వేసింది. ఈమధ్యనే మా ఇంటికి వచ్చి కలిశారు.

అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నా దగ్గరకు వస్తారు అనుకున్నాను కానీ ఇంతలో ఇలా జరగటం చాలా బాధాకరం. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అన్నారు.

Raj Kumar

Director Raj Kumar

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!